దేశంలో పెరిగిన కరోనా కేసులు.. ఎన్నంటే ?
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 61,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,11,634కు చేరింది. ఇక నిన్న కరోనాతో 1,005 మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,99,459 కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 5,23,257 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 61,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,11,634కు చేరింది. ఇక నిన్న కరోనాతో 1,005 మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,99,459 కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 5,23,257 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,94,88,918 మంది కోలుకున్నారు.