వలస కూలీల్లో కరోనా కేసులు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ర్టానికి వస్తున్న వారిలో కరోనా కేసులు బయటపడుతున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో బుధవారం 41 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 31 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 10 మంది వలస కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 35మంది వలస కార్మికులు ఉన్నారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య […]

Update: 2020-05-13 11:37 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ర్టానికి వస్తున్న వారిలో కరోనా కేసులు బయటపడుతున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో బుధవారం 41 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 31 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 10 మంది వలస కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 35మంది వలస కార్మికులు ఉన్నారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 34కు చేరుకుంది. హైదరాబాద్‌లో 38 ఏళ్ల మహిళ, ఒక వృద్దుడు(74) బుధవారం మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 939 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 394 మంది చికిత్స తీసుకుంటున్నట్టు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Tags:    

Similar News