ఘోరంగా కరోనా విజృంభణ

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు నమోదయ్యాయి. 553 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 9 లక్షల 6,752కు చేరుకుంది. ఇందులో 5 లక్షల 71 వేల 460 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 11,585 మంది […]

Update: 2020-07-13 22:57 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు నమోదయ్యాయి. 553 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 9 లక్షల 6,752కు చేరుకుంది. ఇందులో 5 లక్షల 71 వేల 460 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 11,585 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 23,727 కు చేరింది.

Tags:    

Similar News