విజయవాడలో తొలి కరోనా కేసు?
విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైంది. విజయవాడలోని వన్ టౌన్ మేకలవారి వీధికి చెందిన యువకుడు ఇటీవలే పారిస్ నుంచి ఢిల్లీ మీదుగా విజయవాడ వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఫుల్ సూట్‌లో అతని నివాసానికి చేరుకున్న వైద్య ఆరోగ్య సిబ్బంది బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్య, మున్సిపల్ శాఖలకు చెందిన సిబ్బందితో ఆ వీధి మొత్తాన్ని శానిటైజ్ చేయించారు. అంతే కాకుండా అతని కుటుంబ సభ్యులను, అతనిని కలిసిన బంధువులు, స్నేహితులను జాగ్రత్తలపై హెచ్చరించారు. […]
విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైంది. విజయవాడలోని వన్ టౌన్ మేకలవారి వీధికి చెందిన యువకుడు ఇటీవలే పారిస్ నుంచి ఢిల్లీ మీదుగా విజయవాడ వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఫుల్ సూట్‌లో అతని నివాసానికి చేరుకున్న వైద్య ఆరోగ్య సిబ్బంది బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్య, మున్సిపల్ శాఖలకు చెందిన సిబ్బందితో ఆ వీధి మొత్తాన్ని శానిటైజ్ చేయించారు. అంతే కాకుండా అతని కుటుంబ సభ్యులను, అతనిని కలిసిన బంధువులు, స్నేహితులను జాగ్రత్తలపై హెచ్చరించారు. 14 రోజుల పాటు హౌస్ క్వారంటైన్ కావాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యులకు సమాచారం అందించాలని సూచించారు.