కిషన్ రెడ్డి స్వాగత తోరణాలు తొలగింపుపై వివాదం

దిశ, బేగంపేట: తొలిసారిగా రాష్ట్రానికి ఆశీర్వాద సభ పేరిట విచ్చేస్తున్న కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు భారీగా కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని రామ్ గోపాల్ పేట మోండా డివిజన్ కార్పొరేటర్లు చీర సుచిత్ర శ్రీకాంత్ కొంతం దీపిక స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున రామ్ గోపాల్ పేట డివిజన్‌లో భరణి కాంప్లెక్స్ నందు భారీగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు తొలగించినట్లు కార్పొరేటర్ చీర […]

Update: 2021-08-21 05:14 GMT

దిశ, బేగంపేట: తొలిసారిగా రాష్ట్రానికి ఆశీర్వాద సభ పేరిట విచ్చేస్తున్న కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు భారీగా కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని రామ్ గోపాల్ పేట మోండా డివిజన్ కార్పొరేటర్లు చీర సుచిత్ర శ్రీకాంత్ కొంతం దీపిక స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున రామ్ గోపాల్ పేట డివిజన్‌లో భరణి కాంప్లెక్స్ నందు భారీగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు తొలగించినట్లు కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆరోపించారు. దీంతో పాటు మోండా డివిజన్‌లోని క్లాక్ టవర్ గార్డెన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు తొలగించడం పట్ల స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ బేగంపేట డిప్యూటీ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో తాము బ్యానర్లు తొలగించలేదని, తమకు సంబంధం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు దాట వేస్తున్నట్లు కార్పొరేటర్ కొంతం దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కాకుండా డి పి ఆర్ ఓ ఫోర్స్ తొలగించవచ్చని, జీహెచ్‌ఎంసీ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తొలిసారిగా కేబినెట్ హోదాలో రాష్ట్రానికి రావడం శుభపరిణామం. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవమాన పరిచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News