కుక్కలు కూడా దగ్గరకు రానియ్యవు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ నిర్మల్: భూనిర్వాసితులను కుక్కలు కూడా దగ్గరకు రానియ్యవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనం ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి వాహనాన్ని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. సదర్మాట్ బ్యారేజీ నిర్మాణంలో కోల్పోయిన భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మహిళా రైతులు తమ భూములకు పరిహారం ఇవ్వాలని మంత్రి ముందు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తాము చెప్పిన విధంగానే […]

Update: 2021-02-13 06:42 GMT

దిశ నిర్మల్: భూనిర్వాసితులను కుక్కలు కూడా దగ్గరకు రానియ్యవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనం ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి వాహనాన్ని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. సదర్మాట్ బ్యారేజీ నిర్మాణంలో కోల్పోయిన భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మహిళా రైతులు తమ భూములకు పరిహారం ఇవ్వాలని మంత్రి ముందు కన్నీటిపర్యంతమయ్యారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తాము చెప్పిన విధంగానే పరిహారం చెల్లిస్తామని, అందరికంటే ఎక్కువగా మీకే ధర వచ్చేలా చేస్తామన్నారు. ఇదే క్రమంలో అధికారంలో ఉంది మేమే అంటూ గుర్తు చేసిన ఇంద్రకరణ్ రెడ్డి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటామని చెప్పారు. రైతులకు ఏమి చేయాలో తమకు తెలుసు అంటూనే.. టీఆర్ఎస్ తప్ప ఎవరు కూడా రైతులను కానరు అంటూ వ్యాఖ్యానించారు. ‘మిమ్మల్నీ కుక్కలు కూడా దగ్గరకు రానివ్వవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఇలా అంటూనే మంత్రి రాబోయే రోజుల్లో అధికారులతో చర్చించి ఎక్కువ ధర వచ్చేందుకు కృషి చేస్తానని నచ్చజెప్పి రైతులను శాంతింపజేయడం గమనార్హం.

Tags:    

Similar News