నల్గొండలో కంటైన్‌మెంట్ జోన్ల ఎత్తివేత : కలెక్టర్ ప్రశాంత్ పాటిల్
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిన మీర్ బాగ్ కాలనీ, మాన్యం చెలక, బర్కత్ పుర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్ జోన్లను ఎత్తి వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ ఏరియాల్లో సెక్యూరిటీని 28 రోజుల పాటు కఠినంగా నిర్వర్తించామన్నారు. ఈ చర్యల వలన 16 రోజుల నుంచి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ […]
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిన మీర్ బాగ్ కాలనీ, మాన్యం చెలక, బర్కత్ పుర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్ జోన్లను ఎత్తి వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ ఏరియాల్లో సెక్యూరిటీని 28 రోజుల పాటు కఠినంగా నిర్వర్తించామన్నారు. ఈ చర్యల వలన 16 రోజుల నుంచి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ వివరించారు. కరోనా నియంత్రణకు కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రజలు, ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకరించినందున వారందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ అభినందనలు తెలిపారు.
tags: containment zone, lifting, collector prashanth jeevan patil, nalgonda