నల్గొండలో కంటైన్‌మెంట్ జోన్ ఎత్తివేత
దిశ, నల్లగొండ : నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులో గల ఓ కాలనీని కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించినట్టు జిల్లా డీఎంహెచ్‌వో కొండల్ రావు తెలిపారు.ఆరెంజ్ జోన్ కాస్త గ్రీన్ జోన్‌లోకి మారిందని వివరించారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు నల్లగొండలోని 5 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పక్క జిల్లా యాదాద్రి భువనగిరిలో వలస కార్మికుల వల్ల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం […]
దిశ, నల్లగొండ : నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులో గల ఓ కాలనీని కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించినట్టు జిల్లా డీఎంహెచ్‌వో కొండల్ రావు తెలిపారు.ఆరెంజ్ జోన్ కాస్త గ్రీన్ జోన్‌లోకి మారిందని వివరించారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు నల్లగొండలోని 5 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పక్క జిల్లా యాదాద్రి భువనగిరిలో వలస కార్మికుల వల్ల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సూచించారు.