సన్‌రైజ్ ఫుడ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఐటీసీ!

దిశ, సెంట్రల్ డెస్క్: ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థ ఐటీసీ ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థ సన్‌రైజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీని కొనుగోలు చేసింది. దీనికోసం ఐటీసీ సంస్థ రూ. 1800 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్ల వరకు చెల్లించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సన్‌రైజ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నామని ఐటీసీ పేర్కొంది. ఈ ఒప్పందం ద్వారా ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడమే కాకుండా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తామని కంపెనీ వివరించింది. 70 […]

Update: 2020-05-25 07:45 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థ ఐటీసీ ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థ సన్‌రైజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీని కొనుగోలు చేసింది. దీనికోసం ఐటీసీ సంస్థ రూ. 1800 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్ల వరకు చెల్లించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సన్‌రైజ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నామని ఐటీసీ పేర్కొంది. ఈ ఒప్పందం ద్వారా ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడమే కాకుండా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తామని కంపెనీ వివరించింది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన సన్‌రైజ్ ఫుడ్స్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాల మార్కెట్లో లీడర్‌గా కొనసాగుతోంది. ఈ కంపెనీని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ మార్కెట్లో మరింత పట్టు లభిస్తుందని ఐటీసీ భావిస్తోంది.

Tags:    

Similar News