కోటి మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాముల నిర్మాణం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ గిడ్డంగుల సంస్థ నిర్వహించిన 15వ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్నిరకాల గోదాంలు కలిపి 65.40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయని తెలిపారు. కొత్తగా 2.93 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంల ఏర్పాటు పనులు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ గిడ్డంగుల సంస్థ నిర్వహించిన 15వ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్నిరకాల గోదాంలు కలిపి 65.40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయని తెలిపారు.
కొత్తగా 2.93 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ ఆవిర్భావం వరకు రాష్ట్రంలో ఉన్నది 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యమున్న గోదాంలేనని, తెలంగాణ వచ్చిన తరువాత వీటి సంఖ్య ఘణనీయంగా పెరిగిందన్నారు. కొత్తగా మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యమున్న గోడౌన్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ప్రకటించారు. వీటి నిర్మాణం కోసం భూ కేటాయింపులను అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. సాగునీటి రాక, సాగుకు సర్కారు ప్రోత్సాహంతో రాష్ట్రంలో సాగు, దిగుబడులు పెరిగాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న గోదాములు సరిపోక పోవడంతో పత్తి మిల్లులు, రైతువేదికలలో పంటలను నిల్వ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్, ఎండీ జితేందర్ రెడ్డి, డైరెక్టర్లు ఆర్.ఆర్ అగర్వాల్, అజయ్ జాదూ, ముత్తురామన్ తదితరులు పాల్గొన్నారు.