రూ.420 కోట్లతో మరో ఎలివేటేడ్​ కారిడార్​

దిశ, న్యూస్‌బ్యూరో: రూ. 420 కోట్లతో నిర్మించే ఎలివేటేడ్ కారిడార్‌కు ఈ నెల 11న మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 350 కోట్లతో ఇందిరాపార్క్‌ నుంచి విఎస్‌టి వరకు మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మరొకటి రూ.76 కోట్లతో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి ఫేజ్‌-2 సెకండ్‌ లెవెల్‌లో మూడు లైన్ల ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని నిర్మించనున్నట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్​ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ […]

Update: 2020-07-09 10:03 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రూ. 420 కోట్లతో నిర్మించే ఎలివేటేడ్ కారిడార్‌కు ఈ నెల 11న మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 350 కోట్లతో ఇందిరాపార్క్‌ నుంచి విఎస్‌టి వరకు మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మరొకటి రూ.76 కోట్లతో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి ఫేజ్‌-2 సెకండ్‌ లెవెల్‌లో మూడు లైన్ల ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని నిర్మించనున్నట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్​ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పనులను 24నెలల్లోనే పూర్తిచేయనున్నామని, పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వేలాది వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News