ఆ ఘనత అంబేద్కర్‌కే దక్కుతుంది: కవిత

దిశ, పిట్లం: బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లడమే భారత రాజ్యాంగ లక్ష్యమని ఎంపీపీ కవిత విజయ్ అన్నారు. 72 వ భారత రాజ్యాంగ దివాస్ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన ఘనత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కే దక్కిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అరికెల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ […]

Update: 2021-11-26 03:33 GMT

దిశ, పిట్లం: బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లడమే భారత రాజ్యాంగ లక్ష్యమని ఎంపీపీ కవిత విజయ్ అన్నారు. 72 వ భారత రాజ్యాంగ దివాస్ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన ఘనత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కే దక్కిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అరికెల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి, బ్రాహ్మణపల్లి సర్పంచ్ బీరప్ప, బండపల్లి ఎంపీటీసీ నారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కుమ్మరి రాములు, మహిపాల్ రెడ్డి, విజయ్, శివాజీ రావు, అశోక్ రావు, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News