ఎక్సైజ్ ఆఫీస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య
దిశ, రాజేంద్రనగర్ : ఓ కానిస్టేబుల్ ఇంటి నుంచి ఉద్యోగానికి వచ్చి ఆఫీసులోని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్జీఐఏ సబ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్‌లోని జిల్లా ఆబ్కారీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని రిలీవర్ కానిస్టేబుల్ బండారి గణేష్ సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా వికారాబాద్ జిల్లా ఎన్కేతల గ్రామానికి చెందిన ఆర్కతల ఆశయ్య (48) లుంగీతో ఫ్యాన్‌కు ఉరి […]
దిశ, రాజేంద్రనగర్ : ఓ కానిస్టేబుల్ ఇంటి నుంచి ఉద్యోగానికి వచ్చి ఆఫీసులోని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్జీఐఏ సబ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్‌లోని జిల్లా ఆబ్కారీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని రిలీవర్ కానిస్టేబుల్ బండారి గణేష్ సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా వికారాబాద్ జిల్లా ఎన్కేతల గ్రామానికి చెందిన ఆర్కతల ఆశయ్య (48) లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు తెలియజేశామని, మృతి చెందిన కానిస్టేబుల్ 4 వ తేదీన రాత్రి 10 గంటలకు డ్యూటీకి వచ్చి తెల్లారి 10 గంటలకు డ్యూటీ దిగాల్సి ఉంది. కానీ రిలీవర్ కానిస్టేబుల్ గణేష్ ఉదయం వచ్చి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందాడని తెలిపారు. ఆశయ్య 1995 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్.
పదేళ్ల క్రితమే ఆశయ్యకు గుండె ఆపరేషన్ జరిగిందని, మద్యానికి బానిసయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలోనే కడుపు నొప్పి వచ్చి, ఆ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సబ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ నాయక్ చెప్పారు.