కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారడం ఖాయం: బీజేపీ నేత లక్ష్మణ్
దేశంలో రోజుకు రోజుకూ బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీగా మారబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఓట్ల పరంగా పుంజుకుందని అన్నారు. లక్ష్మణ్ యాదాద్రి ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రజలిచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని వెల్లడించారు. సీఏఏకు మద్దతుగా హైదరాబాదులో త్వరలోనే భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని దీనికి కేంద్ర కేంద్ర హోంమంత్రి […]
దేశంలో రోజుకు రోజుకూ బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీగా మారబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఓట్ల పరంగా పుంజుకుందని అన్నారు. లక్ష్మణ్ యాదాద్రి ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రజలిచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని వెల్లడించారు. సీఏఏకు మద్దతుగా హైదరాబాదులో త్వరలోనే భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని దీనికి కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.