ఇన్‌చార్జిగా ఉన్న గ్రామంలో ఉత్తమ్‌కు షాక్
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల కౌంటింగ్‌లో పత్తా లేకుండా పోతోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించిన లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆయన బాధ్యత తీసుకున్న ఆ గ్రామంలో కాంగ్రెస్‌కు కేవలం 163 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక […]
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల కౌంటింగ్‌లో పత్తా లేకుండా పోతోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించిన లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆయన బాధ్యత తీసుకున్న ఆ గ్రామంలో కాంగ్రెస్‌కు కేవలం 163 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి 520 ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి 490 ఓట్లు పోలయ్యాయి. టీపీసీసీ చీఫ్‌గా ఈ పరిణామం ఆయనకు కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి.