‘షర్మిల’కు అంతకుమించి.. ఏం లేదు : వీహెచ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఖమ్మం జిల్లాలో తలపెట్టిన సంకల్ప సభకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎలా పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే ఇపుడు ర్యాలీలు, సభలకు అనుమతినివ్వడం ఎంటనీ మండిపడ్డారు. మేము ఏదైనా మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే ఈ ప్రభుత్వం షర్మిలకు ఎలా అనుమతినిచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఖమ్మం జిల్లాలో తలపెట్టిన సంకల్ప సభకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎలా పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే ఇపుడు ర్యాలీలు, సభలకు అనుమతినివ్వడం ఎంటనీ మండిపడ్డారు. మేము ఏదైనా మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే ఈ ప్రభుత్వం షర్మిలకు ఎలా అనుమతినిచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాకో న్యాయం వారికో న్యాయమా అని ప్రశ్నించారు. ఇకపోతే షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు మాత్రమేనని, అంతకు మంచి ఏం లేదన్నారు. అటు ఆంధ్రాలో కొడుకు జగన్, ఇటు తెలంగాలో బిడ్డ షర్మిల ఉండాలని వైఎస్ విజయమ్మ కోరుకుంటుందా..? మీరెం చేయాలన్న పోయి ఆంధ్రాలో చేసుకోండంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వీహెచ్ తీవ్రంగా విరుచుక పడ్డారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు డబ్బులతో గెలవాలని చూస్తున్నారని, అందుకోసం విచ్చలవిడిగా మద్యం, డబ్బు ప్రవాహం నడుస్తోందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం కూడా పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని కామెంట్స్ చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే జానారెడ్డి గెలుపు ఖాయం.. ప్రజలు జానారెడ్డి పక్షానే ఉన్నారు.. కానీ టీఆర్ఎస్ డబ్బుతో జనాలను కొనాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ ఆరోపించారు.