ఈనెల 27న కాంగ్రెస్ ప్రజా గర్జన బహిరంగ సభ
దిశ, హాలియా: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలంగాణ పీసీసీ చీఫ్ నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ జానారెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో జానారెడ్డికి అత్యధిక శాతం మంది ప్రజలు ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల […]
దిశ, హాలియా: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలంగాణ పీసీసీ చీఫ్ నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ జానారెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో జానారెడ్డికి అత్యధిక శాతం మంది ప్రజలు ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలను వెదజల్లి టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని ఆరోపించారు.
ఈ ప్రాంతంలో జానారెడ్డి గత 40 ఏళ్లుగా రాజకీయ విలువలకు కట్టుబడి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. ఆయన గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. మాయమాటలతో జనాన్ని మోసం చేసే టిఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 27న హాలియాలో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కుందూరు రఘువీర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి నాగరాజు యాదవ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.