పేదలందరికీ ఉచిత బియ్యం అందించాలి
– కాంగ్రెస్ పార్టీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ డిమాండ్ దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉచిత బియ్యం అందజేయాలనీ, తెల్లరేషన్ కార్డుల దరఖాస్తుదారులకు తాత్కాలిక కార్డులు అందజేసి వారి కుటుంబాలకు చేయుత నివ్వాలని కాంగ్రెస్ పార్టీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శశిధర్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి […]
– కాంగ్రెస్ పార్టీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ డిమాండ్
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉచిత బియ్యం అందజేయాలనీ, తెల్లరేషన్ కార్డుల దరఖాస్తుదారులకు తాత్కాలిక కార్డులు అందజేసి వారి కుటుంబాలకు చేయుత నివ్వాలని కాంగ్రెస్ పార్టీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శశిధర్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) నియంత్రణలో భాగంగా ఇంటికే పరిమితమై ఆకలితో అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులకు అర్హత గల 18 లక్షల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారికి వెంటనే రేషన్ కార్డులు అందజేసి వారికి రేషన్ సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేని సుమారు 4.5 లక్షల మంది పేదలు ఉన్నరని తెలిపారు. వారికీ రేషన్ అందజేయాలని కోరారు.
Tags:Congress party, covid 19 Task Force Committee, writes, letter, to CM KCR