అక్కడ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీ ఆఫీసు ఎందుకు మూసేశారు ?

దిశ, మణుగూరు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ మంచి జోష్‌లో ఉంటుందని రాష్ట్ర ప్రజల  భావించారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే సంకల్పంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోరాటం చేస్తుంటే ఆపోరాటాన్ని కొంతమంది వ్యక్తులు నవ్వులపాలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మూతపడటం సంచలనంగా మారింది. దాదాపు కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యాలయానికి రెంటు కట్టడంలేదనే […]

Update: 2021-12-18 02:27 GMT

దిశ, మణుగూరు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ మంచి జోష్‌లో ఉంటుందని రాష్ట్ర ప్రజల భావించారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే సంకల్పంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోరాటం చేస్తుంటే ఆపోరాటాన్ని కొంతమంది వ్యక్తులు నవ్వులపాలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మూతపడటం సంచలనంగా మారింది. దాదాపు కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యాలయానికి రెంటు కట్టడంలేదనే నెపంతో ఇంటి ఓనర్ కార్యాలయాన్ని మూపించారనే ఆరోపణలు మండల వ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పార్టీ కోసం కానీ, ప్రజల కోసం కానీ ఏనాడు కష్టపడలేదనే వదంతులు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగిన కొన్ని కీలక కార్యక్రమాలకు ఎగణామం పెట్టి నిత్యం దందాలకే పాల్పడ్డారనే ఆరోపణలు పార్టీ కార్యకర్తల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే కాబోలు గతంలో మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో పినపాక మండల అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

ఇకపోతే మండలంలో కొంతమంది వ్యాపార వేత్తలు బిజినెస్ చేసుకుంటూ పార్టీ మీద ఉన్న ప్రేమతో పార్టీకి కొంత ఫండ్స్ ఇచ్చారనే మాటలు కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా వినిపిస్తున్నాయి. పార్టీ‌కి ఫండ్స్ ఇచ్చారో.. లేదో.. పక్కనపెడితే కనీసం పార్టీ ఆఫీస్ రెంటు కట్టకపోవడం సిగ్గుచేటని పలువురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అయితే పార్టీ ఫండ్స్ కింద వచ్చిన డబ్బులను మండల అధ్యక్షుడు ఏంచేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన ఏ డబ్బులు పార్టీకి పనిచేయడంలేదని అనడానికి మూతపడిన పార్టీ కార్యాలయమే నిదర్శనం అంటున్నారు మరికొందరు.

ఇక మూతపడిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను కాంగ్రెస్ అభిమానులు చూసి రేవంత్ రెడ్డి పరువును, పార్టీ పరువును బజారుకు ఈడ్చేశారని మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ మాట పక్కనపెట్టి, ముందు పార్టీ కార్యాలయన్ని చూసుకోవాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి మండలానికి మంచి నాయకుడిని ఎన్నిక చేయాలని, పినపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోకుండా చూడాలని ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు కోరుతున్నారు. ఏది ఏమైనా మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మూత పడటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈవిషయంపై టీపీసీసీ అధ్యక్షులు,డీసీసీ ఉపాధ్యక్షులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News