వారిపై కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రైతుల భరోసా దీక్షలో అనేక మంది రైతులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. యాసంగి నాట్లు మొదలైన తరుణంలో యూరియా కొరత ఉందని రైతులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్లు అయినా లక్ష రుణ మాఫీ హామీ అమలు కాలేదని మండిపడ్డారు. మరోవైపు రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రైతుల భరోసా దీక్షలో అనేక మంది రైతులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. యాసంగి నాట్లు మొదలైన తరుణంలో యూరియా కొరత ఉందని రైతులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్లు అయినా లక్ష రుణ మాఫీ హామీ అమలు కాలేదని మండిపడ్డారు. మరోవైపు రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. రైతుబంధు నిధులు పాత రుణాల వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని విమర్శించారు.
సన్నవడ్లు పండించిన రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి నెలకొందని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాంహౌస్‌లో కూర్చుని దృతరాష్ట్రుడిలా అంతా బాగుంది అని భ్రమించకండని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. రైతుల రుణమాఫీ నిధులను తక్షణమే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.