అందరి ముందే కేసీఆర్ ను పొగిడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

దిశ, భూపాలపల్లి: పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై శనివారం జిల్లా కేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమైన విషయమని, ఆర్ఓఎఫ్ఆర్ పత్రాలను పొంది భూములను సాగు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, […]

Update: 2021-10-30 11:20 GMT

దిశ, భూపాలపల్లి: పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై శనివారం జిల్లా కేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమైన విషయమని, ఆర్ఓఎఫ్ఆర్ పత్రాలను పొంది భూములను సాగు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలు ఉన్న భూములకు రైతుబంధు, పంట రుణాలు అందించాలన్నారు. ఫారెస్ట్ భూములపై రెవెన్యూ, అటవీశాఖ సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి జాయింట్ సర్వే చేసి పరిష్కరించాలని, పోలీస్ శాఖ వారు తొందరపడి ఆదివాసి, గిరిజన రైతులపై కేసులు పెట్టొద్దన్నారు.

Tags:    

Similar News