కరోనా పేషెంట్లకు నాణ్యమైన ఆహారం..

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో రోజుకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకారంతో ఐజ మండల కేంద్రంలోని కాంగ్రెస్ శ్రేణులు చేసిన ధర్నా ఫలితంగా మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో ఉంటున్న కరోనా పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని సంపత్ కుమార్ మంగళవారం నుంచి అందించనున్నారు. ఇవాళ వీడియో కాల్ ద్వారా పేషెంట్లతో మాట్లాడి […]

Update: 2020-08-03 09:08 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో రోజుకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకారంతో ఐజ మండల కేంద్రంలోని కాంగ్రెస్ శ్రేణులు చేసిన ధర్నా ఫలితంగా మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో ఉంటున్న కరోనా పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని సంపత్ కుమార్ మంగళవారం నుంచి అందించనున్నారు.

ఇవాళ వీడియో కాల్ ద్వారా పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కరోనా పేషెంట్‌లకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వంతో పోరాడి అన్ని సమకూర్చేలా చూస్తాం అని బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. బాధితులు సంపత్‌తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ధర్నాతోనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటైందన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయమని వారితో వారి బాధలను పంచుకున్నారు. ఈ కరోనా బాధితులకు సాయం చేసే విషయంలో కొందరి సహకారంతో కొంత సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని వారికి తెలపారు.

Tags:    

Similar News