తలసాని బేషరతుగా క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి
దిశ, న్యూస్ బ్యూరో: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దేశ సరిహద్దులో పనిచేస్తున్న సైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పకుండా తలసాని సంగారెడ్డిలో ఎక్కడ అడుగు పెట్టినా ఘెరావ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ,లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా ప్రభుత్వానికి సహకారించాలని తమ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తూ […]
దిశ, న్యూస్ బ్యూరో:
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దేశ సరిహద్దులో పనిచేస్తున్న సైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పకుండా తలసాని సంగారెడ్డిలో ఎక్కడ అడుగు పెట్టినా ఘెరావ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ,లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా ప్రభుత్వానికి సహకారించాలని తమ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తూ వచ్చామన్నారు. విపత్కాల సమయంలో రాజకీయంగా ప్రభుత్వంపై ఎక్కడా విమర్శలు చేయలేదన్నారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేద్దామన్నా కేసీఆర్ సమయం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ది వన్ మ్యాన్ షో నడుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం లోపాలను సరిదిద్దుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో మొత్తం ఆయన మాటలకు భజన చేసేవారే ఉన్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ ఎదుట మాట్లాడే దమ్మున్న మంత్రి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మంత్రి వర్గంలో పనిచేస్తున్న దద్దమ్మ తలసాని శ్రీనివాస్ యాదవ్ దేశ సరిహద్దులో పనిచేస్తున్న సైనికులను డబ్బుల కోసమే పనిచేస్తున్నరని హేలన చేసి మాట్లాడటం సరికాదన్నారు. దేశ సైనిక దళాన్ని అవమానిచడమే అవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి సమర్ధిస్తున్నడా అని అడిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై చర్యలు తీసుకుంటారో లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నట్లు లేదన్నారు. వైన్‌షాపు ఓపెన్ చేయడంతో వేలాది మంది రోడ్ల మీదికి వస్తున్నారన్నారు. ప్రజలకు జరగరానిది ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించాలని హెచ్చరించారు. వైన్‌షాపులు ఎదుట బారులు తీరిన జనాలకు రాని కరోనా ప్రార్థన మందిరాల వద్దనే వస్తుందా అని ప్రశ్నించారు. రంజాన్ ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులు ప్రార్థన మందిరాలకు వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. తలసాని దేశ సైనికులకు, మాజీ సైనికుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తలసాని తన పైల్వాన్ మాటలు..చేతలు మానుకోవాలని హెచ్చరించారు.
Tags: Congress Mla Jaggareddy, press meet, minister Talasani srinivas yadav, comments, on Soldiers