సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో రైతు సమస్యలు, ఉపాధి హామీ కూలీలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి, కోదండరెడ్డి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటన చేసినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. వరి, మొక్కజొన్న, కందుల సేకరణకు 69వేల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల మంత్రి చెప్పినా.. ఇప్పటివరకు 2,400 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారని, […]
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో రైతు సమస్యలు, ఉపాధి హామీ కూలీలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి, కోదండరెడ్డి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటన చేసినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. వరి, మొక్కజొన్న, కందుల సేకరణకు 69వేల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల మంత్రి చెప్పినా.. ఇప్పటివరకు 2,400 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారని, గోనె సంచులు, కూలీల విషయంలో జాప్యం జరుగుతుందన్నారు. దీంతో రైతులకు ఇబ్బంది జరిగి పంటను అమ్ముకునే పరిస్థితులు కనపడటం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అటు బత్తాయి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది బత్తాయి టన్నుకు రూ.40వేలు ఉంటే ఇప్పుడు రూ.10వేలు మాత్రమే పలుకుతుందని, ఢిల్లీ మార్కెట్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎంను కోరారు.
అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను సైతం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 41,500 ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద నాలుగైదు ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, క్లిష్ట సమయంలో సలహాలు, సూచనలు చేస్తామన్నారు.
tags: Congress letter to CM KCR, Uttam Kumar Reddy, Bhatti Vikramarka, Input subsidy, Corona virus, lockdown