ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్‌లో సమాలోచనలు
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెండు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాబాద్, రంగారెడ్డి స్థానానికి చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, సంపత్ పేర్లు పరిశీలనలో ఉండగా… వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి రాములు […]
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెండు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాబాద్, రంగారెడ్డి స్థానానికి చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, సంపత్ పేర్లు పరిశీలనలో ఉండగా… వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి రాములు నాయక్, బెల్లయ్య నాయక్, మానవతారాయ్ పోటీ పడుతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే వారి కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్లు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చిన్నారెడ్డి, వరంగల్‌కు రాములు నాయక్ ఖరారయ్యాని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏఐసీసీ దూత మాణిక్కం ఠాగూర్‌కు నివేదిక ఇవ్వాలని, ఠాగూర్ త్వరలోనే హైదరాబాద్‌కు వస్తారని చెప్పుతున్నారు. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి బోసు రాజ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు.