బీటీ రోడ్డుపై వ్యవసాయం.. వరినాట్లు వేసిన కాంగ్రెస్ నేతలు

దిశ  ప్రతినిధి, నిజామాబాద్: జుక్కల్ నియోజకవర్గంలో బీటీ రోడ్లపై వ్యవసాయం చేశారు యువజన కాంగ్రెస్ నేతలు. పిట్లం మండలం తిమ్మానాగర్ తండాలో రోడ్డుపైనే వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు రాంరెడ్డి మాట్లాడుతూ.. మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హన్మంత్ షిండే తండాలో రోడ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో బీటీ రోడ్డు కాస్తా బురదమయంగా మారిందని చెప్పారు. అందుకే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపినట్టు వెల్లడించారు. […]

Update: 2021-07-24 05:30 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జుక్కల్ నియోజకవర్గంలో బీటీ రోడ్లపై వ్యవసాయం చేశారు యువజన కాంగ్రెస్ నేతలు. పిట్లం మండలం తిమ్మానాగర్ తండాలో రోడ్డుపైనే వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు రాంరెడ్డి మాట్లాడుతూ.. మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హన్మంత్ షిండే తండాలో రోడ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో బీటీ రోడ్డు కాస్తా బురదమయంగా మారిందని చెప్పారు. అందుకే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపినట్టు వెల్లడించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షులు ఇమ్రోజ్, మండల అధ్యక్షులు ప్రవీణ్, గిరిజన యువజన అధ్యక్షులు రాజు, మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్, నరేష్, గంగాధర్, ప్రశాంత్, విజయ్, శివప్ప, హోమ్ సింగ్ అద్నాన్ సుధాకర్, సైలాని, రాంచందర్, సంతు, శ్రీనివాస్, వినయ్, పండరి, అఖిల్, జీయ మోసీన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News