‘నాలుగేళ్లు కావొస్తున్నా… నేటికీ పూర్తి కాలే’

దిశ, హుస్నాబాద్: స్వర్ణకారుల సంక్షేమ భవనం నిర్మాణం మొదలు పెట్టి నాలుగేళ్లు కావస్తున్నా… నేటికీ పూర్తికాలేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కో-ఆర్డినేటర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రూ.2 లక్షల జెడ్పీ నిధులతో 2016 డిసెంబర్ 14న స్వర్ణకారుల భవనం నిర్మించేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భూమిపూజ చేశారన్నారు. వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టి, పిల్లర్లు వరకు చేసి, ఆపై నిలిపివేశారు. కాగా […]

Update: 2020-09-13 06:34 GMT

దిశ, హుస్నాబాద్: స్వర్ణకారుల సంక్షేమ భవనం నిర్మాణం మొదలు పెట్టి నాలుగేళ్లు కావస్తున్నా… నేటికీ పూర్తికాలేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కో-ఆర్డినేటర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రూ.2 లక్షల జెడ్పీ నిధులతో 2016 డిసెంబర్ 14న స్వర్ణకారుల భవనం నిర్మించేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భూమిపూజ చేశారన్నారు.

వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టి, పిల్లర్లు వరకు చేసి, ఆపై నిలిపివేశారు. కాగా ఏండ్లు గడుస్తున్నా… భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాత్రుళ్లు మందుబాబులకు అడ్డాగా మారుతుందని ఆరోపించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని స్వర్ణకారుల భవన పూర్తి చేయాలని స్వర్ణకారులు కోరుతున్నారు.

Tags:    

Similar News