గులాబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి

దిశ, బోధన్: ఎడపల్లి మండల పరిధి ఎమ్‌ఎస్‌సీ ఫారం, జైతాపూర్, తనకలాన్ గ్రామ శివారులో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గులాబ్ తుఫాన్ కారణంగా దాదాపు 80 నుంచి 100 ఎకరాల వరి పొలాలు నేలమట్టమయ్యాయి. వరి పొలాలను కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు బుధవారం సందర్శించారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రైతులను ఆదుకునే ప్రభుత్వాలు.. నల్ల చట్టాలు తీసుకొచ్చాయని విమర్శించారు. ప్రభుత్వం ఏమో వరి ఏస్తే ఊరి అంటోందని.. రైతులకు […]

Update: 2021-09-29 06:35 GMT

దిశ, బోధన్: ఎడపల్లి మండల పరిధి ఎమ్‌ఎస్‌సీ ఫారం, జైతాపూర్, తనకలాన్ గ్రామ శివారులో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గులాబ్ తుఫాన్ కారణంగా దాదాపు 80 నుంచి 100 ఎకరాల వరి పొలాలు నేలమట్టమయ్యాయి. వరి పొలాలను కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు బుధవారం సందర్శించారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రైతులను ఆదుకునే ప్రభుత్వాలు.. నల్ల చట్టాలు తీసుకొచ్చాయని విమర్శించారు. ప్రభుత్వం ఏమో వరి ఏస్తే ఊరి అంటోందని.. రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వకపోవడం సరికాదన్నారు.

రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కనీసం ఈ రోజు వరకు కూడా వ్యవసాయ రైతుల పక్షాన మాట్లాడకుండా, రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడటం బాధాకరం అన్నారు. ఎడపల్లి మండలం వ్యవసాయ అధికారితో ఫోన్‌లో మాట్లాడి వెంటనే ఫీల్డ్ విజిట్ చేయాలని.. గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వరి, సోయా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News