సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకుల అరెస్ట్..
దిశ, కొమురవెల్లి : రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ అన్నారు. బేషరతుగా రైతులకు కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ వెంటనే బహిరంగంగా రైతులకు […]
దిశ, కొమురవెల్లి : రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ అన్నారు. బేషరతుగా రైతులకు కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ వెంటనే బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ శ్రీనివాస్, లింగంపల్లి కనకరాజు పలువురు పాల్గొన్నారు.