గవర్నర్‌ను కలిసే యత్నం.. విపక్ష నేతల అరెస్టు

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అవి చట్టరూపం దాల్చినట్లు అధికారిక గెజిట్ కూడా విడుదలైంది. అందుకు నిరసనగా రాష్ట్ర గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పీఎస్‌కు తరలించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ […]

Update: 2020-09-28 08:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అవి చట్టరూపం దాల్చినట్లు అధికారిక గెజిట్ కూడా విడుదలైంది. అందుకు నిరసనగా రాష్ట్ర గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పీఎస్‌కు తరలించారు.

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ మొదట నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించాలని వెళ్లిన సీఎల్పీ నేత భట్టి, ఇతర నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..