ఓట్లు మావి.. పెత్తనం అగ్రకులాల వారిదా? :వీహెచ్

దిశ, వెబ్‌డెస్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మావి, పెత్తనం అగ్రకులాల వారిదా అంటూ ప్రశ్నించారు. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశంలో ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ […]

Update: 2021-02-03 02:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మావి, పెత్తనం అగ్రకులాల వారిదా అంటూ ప్రశ్నించారు. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశంలో ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News