కొత్త చట్టాలతో రైతులకు నష్టం : మధుయాష్కి
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, కార్పొరేట్ శక్తులతో చాలా నష్టపోనున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే, రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. దీంతో రైతులకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదని వెల్లడించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, కార్పొరేట్ శక్తులతో చాలా నష్టపోనున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే, రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. దీంతో రైతులకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదని వెల్లడించారు. అంతేగాకుండా పంటను మార్కెట్ యార్డులోనే అమ్మాలనే నిబంధన తీసుకురావడం సరికాదని అన్నారు. కొత్త చట్టాలతో రైతులకు ఏమాత్రం లాభం ఉందని స్పష్టం చేశారు.