పోలీసులు సతయిస్తున్నారా.. వాళ్ల పేర్లు రాసుకోండి : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ జిల్లాలో జరుగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. సోమవారం జగ్గారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటికీ కేసీఆర్ సీఎంగానే ఉండిపోరు అని అన్నారు. పోలీసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వరంగల్‌లో ఇబ్బంది పెడుతున్న అధికారుల […]

Update: 2021-09-06 01:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ జిల్లాలో జరుగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. సోమవారం జగ్గారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటికీ కేసీఆర్ సీఎంగానే ఉండిపోరు అని అన్నారు.

పోలీసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వరంగల్‌లో ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు నోట్ చేసి పెట్టుకోండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూద్దాం అంటూ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ పథకాలు.. కోడికి మసాలాలు పూసి వేలాడదీసినట్టుగా ఉంటాయి.. ఇలా కోడిని చూడటమే తప్ప.. తినలేమని అన్నారు. అలాగే కేసీఆర్ పథకాలు కూడా కేవలం చెప్పుకోడానికి తప్ప అమలుకు నోచుకోవని ఎద్దేవ చేశారు. కేసీఆర్ కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధును తీసుకువచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా 10 లక్షల బంధు పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వేము నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, దొమ్మటి సాంబయ్య, పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి, ఇతర జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News