ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా !: గూడూరు
దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, కనీసం మాస్కు పెట్టుకోకుండా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో కరోనా టెస్టులకు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని, కరోనా కేసులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు షాపులు తెరవొచ్చని చెప్పి, ఇప్పుడు అన్ని షాపులు తెరిపిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే […]
దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, కనీసం మాస్కు పెట్టుకోకుండా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో కరోనా టెస్టులకు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని, కరోనా కేసులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు షాపులు తెరవొచ్చని చెప్పి, ఇప్పుడు అన్ని షాపులు తెరిపిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే ప్రయత్నిస్తుందని తప్ప, ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.