హుజూరాబాద్ ఉపఎన్నిక క్రమంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నిక కోసం మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌లను ప్రకటించింది. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ సమావేశమైంది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చించారు. అనంతరం హుజురాబాద్ సెగ్మెంట్‌లో ప్రతి మండలానికి ఒక ఇంచార్జ్‌తో పాటు చీఫ్ కో ఆర్డినేటర్‌ను నియమించారు. ఉపఎన్నిక వరకు పార్టీ తరుపున మండలాల్లో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కమలాపూర్ మండలానికి ఇంచార్జ్‌గా ఎమ్మెల్యే సీతక్క, చీఫ్ కో ఆర్డినేటర్‌గా నాయిని రాజేంద్రరెడ్డి, జమ్మికుంట మండలానికి ఎమ్మెల్యే దుద్ధిళ్ల […]

Update: 2021-10-09 06:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నిక కోసం మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌లను ప్రకటించింది. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ సమావేశమైంది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చించారు. అనంతరం హుజురాబాద్ సెగ్మెంట్‌లో ప్రతి మండలానికి ఒక ఇంచార్జ్‌తో పాటు చీఫ్ కో ఆర్డినేటర్‌ను నియమించారు. ఉపఎన్నిక వరకు పార్టీ తరుపున మండలాల్లో బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

కమలాపూర్ మండలానికి ఇంచార్జ్‌గా ఎమ్మెల్యే సీతక్క, చీఫ్ కో ఆర్డినేటర్‌గా నాయిని రాజేంద్రరెడ్డి, జమ్మికుంట మండలానికి ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, చీఫ్ కో ఆర్డినేటర్‌గా విజయరమణారావు, హుజురాబాద్ మండలానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, ఇల్లంతకుంట మండల ఇంచార్జ్‌గా వేం నరేంద్రరెడ్డి, చీఫ్ కో ఆర్డినేటర్‌గా జంగా రాఘవరెడ్డి, వీణవంక మండల ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చీఫ్ కో ఆర్డినేటర్‌గా ఆది శ్రీనివాస్ లను నియమిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News