పార్టీలలో భయం… పోటీకి కాంగ్రెస్, బీజేపీ దూరం

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. రాష్ట్రంలో 12 స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అయినా ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఏయే స్థానాల్లో బరిలో నిలుస్తున్నదీ తేల్చలేదు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ​కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఇందులో చాలా మంది అధికార పక్షానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తే గట్టి […]

Update: 2021-11-21 21:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. రాష్ట్రంలో 12 స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అయినా ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఏయే స్థానాల్లో బరిలో నిలుస్తున్నదీ తేల్చలేదు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ​కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఇందులో చాలా మంది అధికార పక్షానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీ చేస్తే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయంతోనే ఈ రెండు పార్టీలు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది.

Tags:    

Similar News