హుజూర్‌నగర్ మున్సిపల్‌లో కౌన్సిలర్ల ఆందోళన
దిశ, నల్లగొండ: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పూర్తయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కార్యాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పూర్తయిన పనులు ఇంకా జరుగుతున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వారు మండిపడ్డారు. పాలకవర్గానికి తెలియకుండా కొందరు పనులు చేస్తున్నారని, తమకు సమాచారం లేకుండా అసలు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల ఆందోళనపై మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి […]
దిశ, నల్లగొండ: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పూర్తయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కార్యాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పూర్తయిన పనులు ఇంకా జరుగుతున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వారు మండిపడ్డారు. పాలకవర్గానికి తెలియకుండా కొందరు పనులు చేస్తున్నారని, తమకు సమాచారం లేకుండా అసలు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల ఆందోళనపై మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి స్పందించారు. కరోనా నేపథ్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించలేదని, మున్సిపాలిటీలో జరుగుతున్న పనులకు కలెక్టర్ నుంచి అప్రూవల్ ఆర్డర్ ఉందని తెలిపారు. టీయూఎఫ్ఐడీసీ 2018 పనుల్లో భాగంగా కల్వర్ట్ పనులు పూర్తి చేశామని, నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ముందుగా కలెక్టర్ అప్రూవల్‌తో పనులు నిర్వహించాక కూడా పాలకవర్గం తీర్మానం పొందవచ్చన్నారు.
tags: congress and trs councillors, charges , re tender, complete works, protests