కాంగ్రెస్, బీజేపీలు బుద్ది తెచ్చుకోవాలి : మంత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వాగే వారికి ఈ విజయం చెంపపెట్టు అని, బీజేపీ- కాంగ్రెస్‌లు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. మంగళవారం తెలంగాణ భవన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ శాసనమండలిలో ఇతర రాజకీయ పార్టీలకు అవకాశమే లేదు అన్నట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. తమకు ఓట్లు రాకపోతే రాజీనామాలు చేస్తాం అనే […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వాగే వారికి ఈ విజయం చెంపపెట్టు అని, బీజేపీ- కాంగ్రెస్‌లు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. మంగళవారం తెలంగాణ భవన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ శాసనమండలిలో ఇతర రాజకీయ పార్టీలకు అవకాశమే లేదు అన్నట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. తమకు ఓట్లు రాకపోతే రాజీనామాలు చేస్తాం అనే మాటలు విన్నామని అన్నారు. కేసీఆర్ పథకాలే నేటి విజయాలకు కారణం అని పేర్కొన్నారు. గులాబీ జెండాను తామే కాపాడుకుంటాం అని ప్రజలు అంటున్నారని, గెలిచిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల ఓట్లు కూడా టీఆర్ఎస్‌కు పడ్డాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్- బీజేపీ ప్రజాప్రతినిధులు సైతం కేసీఆర్ అభివృద్ధికి ఓటు వేశారన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు సైతం టీఆర్ఎస్ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. పచ్చని తెలంగాణను నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని, అధికార పార్టీ ఓట్లు తమకే పడతాయని ప్రతిపక్ష పార్టీ నేతలు గాల్లోమేడలు కట్టుకున్నారని దుయ్యబట్టారు.
ఈ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారనడానికి నిదర్శనం అన్నారు. మేము ఎవరికి భయపడమని, జాతీయస్థాయిలో టీఆర్ఎస్ పథకాలు వచ్చేలా ప్రణాళికలు వేస్తాం అని స్పష్టం చేశారు. ఎంపీటీసీల సమస్యలు కొన్ని తీర్చామని, భవిష్యత్‌లో అన్ని సమస్యలు పరిష్కారానికి సీఎం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.