అప్పన్నకు అచ్చెన్నాయుడు బెదిరింపులు?
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫ్యామిలీలోనే మనస్పర్థలతో గొడవలు రావడం చర్చనీయాంశంగా మారింది. అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కింజారపు అప్పన్న బరిలోకి దిగుతుండటంతో గొడవ మొదలైంది. ఇదే క్రమంలో అప్పన్నకు ఆదివారం ఉదయం ఫోన్ చేసిన అచ్చెన్నాయుడు నామినేషన్ వేయొద్దని చెప్పారు. అయితే తనకు టీడీపీ, మన ఫ్యామిలీలో గానీ న్యాయం జరగడం లేదని అప్పన్న చెప్పగా… ఇప్పుడు […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫ్యామిలీలోనే మనస్పర్థలతో గొడవలు రావడం చర్చనీయాంశంగా మారింది. అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కింజారపు అప్పన్న బరిలోకి దిగుతుండటంతో గొడవ మొదలైంది. ఇదే క్రమంలో అప్పన్నకు ఆదివారం ఉదయం ఫోన్ చేసిన అచ్చెన్నాయుడు నామినేషన్ వేయొద్దని చెప్పారు. అయితే తనకు టీడీపీ, మన ఫ్యామిలీలో గానీ న్యాయం జరగడం లేదని అప్పన్న చెప్పగా… ఇప్పుడు నేను అన్నీ దగ్గరుండి చూసుకుంటానని అచ్చెన్న వివరించే ప్రయత్నం చేశారు. అయ్యిందేదో అయిపోయింది, ఇదొక్కసారి నా మాట విను.. సర్పంచ్ పదవి ఏమైనా రాష్ట్రపతి పదవా అంటూ అచ్చెన్నాయుడు గట్టిగా అన్నట్లు సమాచారం.
ఇదంత జరుగుతున్న క్రమంలోనే అచ్చెన్నాయుడు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు కలిసి అప్పన్న ఇంటి వద్దకు భారీగా తరలివచ్చారు. నామినేషన్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే..అప్పన్నతో టెక్కలికి చెందిన టీడీపీ లీడర్ దువ్వాడ శ్రీనివాస్ కలవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యాయి. వైసీపీ అభ్యర్థి నానినేషన్ కార్యక్రమానికి టీడీపీ లీడర్ శ్రీనివాస్ వెళ్లడం, అది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అప్పన్న నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ సైతం అడ్డుకున్నట్లు తెలుస్తోంది.