జెండా ఆవిష్కరణలో రచ్చ రచ్చ బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ (వీడియో)

తెలంగాణ బ్యూరో : స్వాతంత్ర దినోత్సవ రోజు మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.  ఈ ఘర్షణలో కార్పొరేటర్ శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో దాడి చేసిన కార్యకర్తలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా మీడియాపై దాడి చేసి కెమెరా, ఫోన్‌లను లాక్కుని అక్కడి నుంచి  […]

Update: 2021-08-14 22:55 GMT

తెలంగాణ బ్యూరో : స్వాతంత్ర దినోత్సవ రోజు మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో కార్పొరేటర్ శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో దాడి చేసిన కార్యకర్తలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా మీడియాపై దాడి చేసి కెమెరా, ఫోన్‌లను లాక్కుని అక్కడి నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పరారయ్యారు. దీంతో మల్కాజిగిరి చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రస్తుతం మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించనున్నారు. ఇక ఈ ఘర్షణపై ఎమ్మెల్యే మైనంపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News