జులై నాటికి ఆటో పరిశ్రమలో డిమాండ్ పుంజుకుంటుంది : మెర్సిడెస్ బెంజ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది మెరుగైన పనితీరును కలిగి ఉండనున్నట్టు కంపెనీ సీఈఓ మార్టిన్ ష్వెంక్ అభిప్రాయపడ్డారు. అలాగే, వినియోగదారుల విశ్వాసం గతేడాది కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత కరోనా తీవ్రత తగ్గితే జులై నాటికి ఆటో పరిశ్రమలో డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని ఆయన అన్నారు. గతేడాది సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించిన తర్వాత మెర్సిడెస్ బెంజ్ ఇండియా […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది మెరుగైన పనితీరును కలిగి ఉండనున్నట్టు కంపెనీ సీఈఓ మార్టిన్ ష్వెంక్ అభిప్రాయపడ్డారు. అలాగే, వినియోగదారుల విశ్వాసం గతేడాది కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత కరోనా తీవ్రత తగ్గితే జులై నాటికి ఆటో పరిశ్రమలో డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని ఆయన అన్నారు. గతేడాది సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించిన తర్వాత మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది మొత్తం 15 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది.
తన కొత్త ఎస్‌యూవీ మోడల్ జీఎల్ఏను నెలరోజులు ఆలస్యమైనప్పటికీ గత వారం విడుదల చేయగలిగింది. ‘మొదటి వేవ్ కరోనా వ్యాప్తి నుంచి కొత్త అంశాలను నేర్చుకున్నాము. ఆర్థిక పునరుద్ధరణ ఎంత వేగంగా జరిగిందనే అంశాన్ని పరిశీలించాం. సెకెండ్ వేవ్ పరిస్థితులు మునుపటిలా లేవు. పరిస్థితి తీవ్ర ప్రతికూలంగా ఉన్నా సరే వ్యాపార కార్యకలాపాలను ఎలా నిర్వహించాలనే దానిపై మరింత విశ్వాసంగా ఉన్నామని’ మెర్సిడెస్ బెజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. ఆర్డర్లు కూడా బలంగా ఉండటం సానుకూలమైన విషయం. లాక్‌డౌన్ నిబంధనలు తగ్గిన వెంటనే వ్యాపారాలు తిరిగి స్థిరంగా కొనసాగుతాయనే నమ్మకం ఉందని మార్టిన్ ష్వెంక్ తెలిపారు.