హుజూరాబాద్ ఎన్నికలు నిర్వహించండి- బీజేపీ మాజీ ఎమ్మెల్యే
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం బుద్దభవన్‌లోని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ శంకర్ గోయల్‌కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినందున సాధ్యమైనంత త్వరగా హుజూరాబాద్‌లో ఉపఎన్నికలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం హుజూరాబాద్‌లో 80శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం బుద్దభవన్‌లోని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ శంకర్ గోయల్‌కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినందున సాధ్యమైనంత త్వరగా హుజూరాబాద్‌లో ఉపఎన్నికలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం హుజూరాబాద్‌లో 80శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్‌గా పాఠశాలలు కూడా ప్రారంభమవుతున్నాయని వివరించారు. ఈ పరిణామాలన్నింటిని గమనించి త్వరలోనే హుజూరాబాద్ ఉపఎన్నికలను నిర్వహించాలని విన్నవించారు.