శాయంపేటలో చనిపోయినా బేరసారాలే.. వాపోతున్న బాధితులు

దిశ, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారి పేటలోని గుట్ట పై నుంచి కంప్రెషర్ ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ప్రమాదవశాత్తు ఓర్సు మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్ ఆర్ క్రషర్ యాజమాన్యం మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. మృతుడి బంధువులు మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. అయితే, క్రషర్ యాజమాన్యం తమ అనుచరులతో బేరసారాలు చేసి ఆ తర్వాత పోస్టుమార్టంకు మృతదేహాన్ని తరలించినట్లు గ్రామస్తులు […]

Update: 2021-10-25 06:33 GMT

దిశ, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారి పేటలోని గుట్ట పై నుంచి కంప్రెషర్ ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ప్రమాదవశాత్తు ఓర్సు మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్ ఆర్ క్రషర్ యాజమాన్యం మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. మృతుడి బంధువులు మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. అయితే, క్రషర్ యాజమాన్యం తమ అనుచరులతో బేరసారాలు చేసి ఆ తర్వాత పోస్టుమార్టంకు మృతదేహాన్ని తరలించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ పనుల్లో కార్మికులకు భద్రత కరువైందని, వారికి ఎలాంటి సేఫ్టీ పరికరాలు అందించకపోవడంతోనే ప్రమాదంలో మరణిస్తున్నారని వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి మరణాలు సంభవించాయని అధికార పార్టీ నాయకుల అండదండలతో ప్రభుత్వ అధికారుల పట్టింపు కరువైందన్నారు. దీంతో శాయంపేటలో మైనింగ్ మాఫియా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News