అట్టుడుకిన పరకాల.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి నిరసన సెగ

దిశ, పరకాల: పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. చేపట్టిన బంద్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత పది రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం చేపట్టిన బంద్ కార్యక్రమం పోలీసుల జోక్యంతో ఉద్రిక్తంగా మారింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహిస్తుండగా.. […]

Update: 2021-07-24 05:00 GMT

దిశ, పరకాల: పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. చేపట్టిన బంద్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత పది రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం చేపట్టిన బంద్ కార్యక్రమం పోలీసుల జోక్యంతో ఉద్రిక్తంగా మారింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహిస్తుండగా.. పలువురు జిల్లా సాధన సమితి సభ్యులు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని శాంతింపజేసే ప్రయత్నంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న జిల్లా సాధన సమితి సభ్యులను పోలీసులు అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరన్నారు. పరకాల జిల్లా కేంద్రంగా మార్చనట్లయితే ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారుతాయని హెచ్చరించారు. జరిగే పరిణామాలకు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్షులు పిట్ట వీరస్వామి, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతలతో పాటు పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News