వీఎన్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో విద్యార్థి ఆత్మహత్య.. గుట్టు చప్పుడు కాకుండా యాజమాన్యం ఏం చేసిందంటే..

దిశ, నిజాంపేట్: బాచుపల్లి విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్న చెట్టుకింది శివనాగు అనే విద్యార్థి గురువారం ఉదయం హాస్టల్ క్యాంపస్ భవనం పైనుంచి  దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి తో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి విఎన్ఆర్ కళాశాల హాస్టల్ భవనం 13వ అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యార్థి మృతిని గుట్టుగా దాచేందుకు […]

Update: 2021-12-23 05:43 GMT

దిశ, నిజాంపేట్: బాచుపల్లి విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్న చెట్టుకింది శివనాగు అనే విద్యార్థి గురువారం ఉదయం హాస్టల్ క్యాంపస్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి తో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి విఎన్ఆర్ కళాశాల హాస్టల్ భవనం 13వ అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యార్థి మృతిని గుట్టుగా దాచేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించింది. కనీసం విద్యార్థి పేరెంట్స్‌కు సరైన సమాచారం ఇవ్వలేదు. ఉదయం 6 గంటలకు విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే 9:30 గంటలకు విద్యార్థి గురించి యాజమాన్యం తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.

విద్యార్ధి మృతి విషయం బయటకు రావడంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, ఏబీవీపీ కార్యకర్తలు కళాశాల గేట్ ముందు విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యం కారణం అని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. బాచుపల్లి ఎస్‌హెచ్‌‌ఓ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కళాశాల ముందు నిరసన తెలుపుతున్న బీజేపీ, ఏబీవీపీ నాయకుల పై లాఠీ ఛార్జ్ అనంతరం అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కొల్లి మాదవి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని బాధితుల పక్షాన నిలిచారు. విద్యార్థి మృతికి కారణం అయిన వీ‌ఎన్‌ఆర్ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు.

ఆందోళన చేసిన బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలపై బాచుపల్లి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం తో బాచుపల్లి పోలీసులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరిన కార్యకర్తలు, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం ఎంతవరకు సమంజసం అని పోలీసులను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ కూన శ్రీశైలం గౌడ్ పోలీస్ స్టేషన్ లో బైటాయించారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ, బీజేపీ నాయకులను విడుదల చేసి, విద్యార్థి మృతికి కారణం అయిన వీఎన్‌ఆర్ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి సూసైడ్ నోట్ పై అనుమానాలు..

బాచుపల్లి వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల హాస్టల్‌లో మృతి చెందిన బీటెక్ విద్యార్థి శివనాగు సూసైడ్ నోట్ విషయంలో పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. విద్యార్థి రాసిన సుసైడ్ లెటర్ మధ్యాహ్నం 1 గంటలకు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరలేదని సిబ్బంది తెలపడంతో అందులో అనుమానం విద్యార్థి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. అసలు సూసైడ్ లెటర్ విద్యార్థి శివనాగులు రాసాడా లేక కళాశాల యాజమాన్యం, పోలీసుల సృష్టితో జరిగిందా అనే కోణంలో అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మృతి చెందిన విద్యార్థి, భద్రత, తల్లిదండ్రుల హక్కుల గూర్చి పట్టించుకోకుండా విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం పై అతిగా భక్తి చాటడం పై స్థానికంగా ఎన్నో అనుమానాలు కల్గించాయి. అయితే విద్యార్థి మృతికి యాజమాన్యమే కారణమా, లేక ఇంకేమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన పోలీసులు కళాశాల యాజమాన్యానికి తొత్తుగా ప్రవర్తించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని విద్యార్థి నాయకులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News