భూస్వామ్య కుటుంబంలో పుట్టి.. పేదల కోసం పోరాడిన మహానేత సుందరయ్య
దిశ, నల్లగొండ: కార్మిక నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ నేత ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. బుధవారం సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల బతుకులను చూసి దోపిడీ వ్యవస్థపై పోరాటం చేసిన మహానేత అని కొనియాడారు. అలగానిపాడులో వ్యవసాయ కార్మికుల […]
దిశ, నల్లగొండ: కార్మిక నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ నేత ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. బుధవారం సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల బతుకులను చూసి దోపిడీ వ్యవస్థపై పోరాటం చేసిన మహానేత అని కొనియాడారు. అలగానిపాడులో వ్యవసాయ కార్మికుల కోసం సంఘం ప్రారంభించి నిత్యవసర వస్తువులను చౌకధరలకు ప్రజలకు అందించారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి అనేక సూచనలు చేశారని కొనియాడారు. వారి స్ఫూర్తితోనే నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.