అక్కడ వీకెండ్ కర్ఫ్యూ
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్ గడ్ రాష్ట్రం సరికొత్త నిర్ణయాలతో.. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మూడో దశ లాక్డౌన్ లో.. మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో…ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా మందుబాబులు వైన్స్‌ల దగ్గర బారులు తీరుతుండటంతో.. ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ఆన్ లైన్ మద్యం విక్రయాలకు తెరతీసిన విషయం తెలిసిందే. ఇందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను […]
దిశ, వెబ్ డెస్క్ :
ఛత్తీస్ గడ్ రాష్ట్రం సరికొత్త నిర్ణయాలతో.. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మూడో దశ లాక్డౌన్ లో.. మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో…ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా మందుబాబులు వైన్స్‌ల దగ్గర బారులు తీరుతుండటంతో.. ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ఆన్ లైన్ మద్యం విక్రయాలకు తెరతీసిన విషయం తెలిసిందే. ఇందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను కూడా రూపొందించి.. వైన్స్ ల దగ్గర రద్దీ లేకుండా చేసేందకు ఇతర రాష్ట్రాలకు ఓ చక్కని పరిష్కారం చూపింది. పంజాబ్ కూడా ఇప్పుడు ఇదే బాటను ఎంచుకుంది. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ నెల మొత్తం శని, ఆదివారాలు పూర్తి లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి భూపేష్‌బాగెల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మే 4వ తేదీ తరువాత కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లు మినహా మిగితా ప్రాంతాల్లో అవసరమైన వస్తువులు విక్రయించే అనేక దుకాణాలు ఒపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో రద్దీ పెరిగిపోయింది. వీకెండ్స్ లో ఆ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ఊహించిన ఛత్తీస్ గఢ్ రాష్ర్ట ప్రభుత్వం వారాంతపు రద్దీని నివారించడానికి శని, ఆదివారం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. కూరగాయలు, పాలు, మెడికల్ షాపులు తమ విక్రయాలు కొనసాగించేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
Tags: chhattisgarh, online liquor, weekend bundh