‘కరోనా.. ఇట్స్ ఎ వార్.. నాట్ ఎ బ్యాటిల్’
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఒక దీర్ఘకాలిక యుద్ధం (వార్) అని అభివర్ణించింది. దీనిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు ‘పూర్తి వైఫల్యం’ చెందాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రస్తావించకుండా ‘కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్’ అని వ్యాఖ్యానించింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విపిన్ సంఘి, […]
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఒక దీర్ఘకాలిక యుద్ధం (వార్) అని అభివర్ణించింది. దీనిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు ‘పూర్తి వైఫల్యం’ చెందాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రస్తావించకుండా ‘కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్’ అని వ్యాఖ్యానించింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇట్స్ ఎ వార్.. నాట్ ఎ బ్యాటిల్..’ అని కామెంట్ చేసింది. వైరస్ ఏ వైపునుంచి ఎలా దాడి చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని తెలిపింది. ‘ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత ఉంది. బెడ్లు దొరకడం లేదు. హాస్పిటల్స్ కొత్త పేషెంట్లను చేర్చుకోవడం లేదు. వైద్యుల ఆర్తనాదాలకు అంతేలేదు..’ అంటూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
(వార్ అంటే దీర్ఘకాలికంగా కొనసాగేది. ఈ పోరాటంలో అనేక యుద్ధాలు జరుగుతాయి. ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ. ఒక నిర్దిష్ట ప్రాంతంలో కాకుండా చాలా చోట్ల జరుగుతుంది. ఉదాహరణ ప్రపంచ యుద్ధం వంటిది. కానీ బ్యాటిల్ తక్కువ వనరులతో, త్వరగా ముగిసేది. ఢిల్లీ కోర్టు కరోనా పరిస్థితులను కూడా వార్‌గా వ్యాఖ్యానించింది. సుమారు ఏడాదిన్నరకాలంగా ప్రపంచం కరోనాతో పోరాటం చేస్తూనే ఉంది)