తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ ఎన్వీ రమణకు ఫిర్యాదు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి 15 నెలలు గడిచిందని, తమ భవిష్యత్తును అంధకారం చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. వ్యవస్థ రద్దు తర్వాత ఏ అంశాన్ని అమలు చేయడం లేదని, దాంతో తమకు తీవ్ర నష్టం కలుగుతున్నదని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోల్కొండ సతీష్​, పల్లెపాటి నరేష్​లు వివరించారు. విజయవాడలోని సీఏ కన్వెన్షన్ సెంటర్ లో […]

Update: 2021-12-27 04:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి 15 నెలలు గడిచిందని, తమ భవిష్యత్తును అంధకారం చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. వ్యవస్థ రద్దు తర్వాత ఏ అంశాన్ని అమలు చేయడం లేదని, దాంతో తమకు తీవ్ర నష్టం కలుగుతున్నదని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోల్కొండ సతీష్​, పల్లెపాటి నరేష్​లు వివరించారు. విజయవాడలోని సీఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో స్వయంగా కలిసి తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ తీరును వివరించారు. ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుతూ.. చనిపోయిన 200 మంది గ్రామ రెవెన్యూ అధికారుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఆగిపోయాయన్నారు.

అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు వచ్చాయని, తమకు మాత్రం 15 నెలలుగా పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక ఉద్యోగికి ప్రతి ఏడాది రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా గ్రామ రెవెన్యూ అధికారులకు రావట్లేదన్నారు. తెలంగాణలోని ప్రజల గ్రామ పరిపాలన కాపాడుతున్న వీఆర్వోల హక్కులను కాపాడాలని మొర పెట్టుకున్నట్లు తెలిపారు. అత్యున్నతమైన రెవెన్యూ శాఖకు ఉనికి లేకుండా చేశారని, శాఖలోని ఉన్నత అధికారుల అధికారాలకు భంగం కలిగిస్తున్నారని, శాఖ అంతరించే విధంగా చేస్తున్న ప్రయత్నం చాలా బాధాకరమన్నారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

సమాజ శ్రేయస్సు కోరుకునే మేధావి వర్గం, లెజిస్లేచర్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మౌనం వహించినప్పుడు, మాట్లాడినా, వినాల్సిన వాళ్ళు విననప్పుడు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనన్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరించి పరిపాలన జరుగుతున్న పరిస్థితుల వల్ల ఉద్యోగులు, ప్రజలు ఇబ్బంది పడడం బాధాకరమన్నారు. అందుకే అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాలపై సుమోటోగా తీసుకుని న్యాయం జరిగేలా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.

Tags:    

Similar News