మహేశ్వరం తహశీల్ధార్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహేశ్వరం తహశీల్దార్ పై ఓ మహిళా రైతు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. తన వ్యవసాయ భూమిని ఇతరులకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్ధార్ ,అటెండర్లపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీని కోరింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మోడి నర్సమ్మ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడుతూ… తనకు గ్రామంలోని సర్వే నెంబర్ 103 /4ఏ లో 4 ఎకరాల 23 గుంటల వ్యవసాయ […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహేశ్వరం తహశీల్దార్ పై ఓ మహిళా రైతు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. తన వ్యవసాయ భూమిని ఇతరులకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్ధార్ ,అటెండర్లపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీని కోరింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మోడి నర్సమ్మ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడుతూ… తనకు గ్రామంలోని సర్వే నెంబర్ 103 /4ఏ లో 4 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ భూమిని తహశీల్దార్ అటెండర్ శేఖర్ సహాయంతో పిప్పుల క్రిష్ణయ్యకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు.
ఈ విషయంలో తహశీల్దార్‌ను ప్రశ్నించినప్పటికీ ఆయన తన ఇష్టం ,తాను ఏదైనా చేస్తానే, నీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ విషయంలో విచారణ జరిపించి తన భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఆమె హెచ్ఆర్సీని కోరింది.